అగ్నిపథ్ నిరసనకారులకు సైన్యం హెచ్చరిక !
1 min readపల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొనేవాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది సైన్యం. ఆర్మీ ఉద్యోగార్థులు నిరసనల్లో పాల్గొంటే.. వాళ్ల మీద గనుక పోలీస్ కేసులు నమోదు అయితే వాటికి క్లియరెన్స్ ఉండబోదని, భవిష్యత్తులో ఆర్మీలో చేరే అవకాశం ఉండదని హెచ్చరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి. అగ్నిపథ్ ఆందోళనలో పాల్గొనే డిఫెన్స్ ఉద్యోగ ఔత్సాహికులు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఉద్రిక్తతలను తాము అస్సలు ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు.