అగ్నిపథ్ ను నిరసిస్తూ కడపలో ఆందోళన !
1 min readపల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని విద్యార్థి,యువజన సంఘాలు కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దేశ రక్షణ రంగంలో పని చేయాలనే సంకల్పం తో సైన్యంలో పని చేయుటకు రెండు సంవత్సరాల కిందట ఆర్మీ ర్యాలీ లో పాల్గొని ,శారీరక పరీక్ష ,వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేయడం దుర్మార్గమని ఏఐవైఎఫ్ నేత గంగా సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఈ తతంగాన్ని రద్దు చేసి కొత్తగా అగ్ని వీరులు పేరుతో టి ఓ డి ప్రవేశపెట్టి సైనిక నియామకాలలో తాత్కాలిక పద్ధతిపై ప్రవేశపెట్టడం నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా దేశ రక్షణకు భద్రతకు విఘాతం కలుగుతుందని వారు ఆరోపించారు. తాత్కాలిక పద్ధతిలో సైనిక నియామకాలు చేపట్టి ఒక సంవత్సరం శిక్షణ పొంది మిగిలిన రెండు సంవత్సరాలు ఉద్యోగంలో చేసి నాలుగు సంవత్సరంలో ఇంటికి వచ్చే దానికి మేము ఇంతగా కష్టపడి శ్రమ చేయాలా అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.