ఇంటర్నెట్ స్వేచ్చలో భారత్ వెనుకంజ !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై దాదాపు ఏడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో అధికారులు ఇంటర్నెట్ సర్వీస్ ను సస్పెండ్ చేస్తున్నారు. ఫలితంగా అన్ని రంగాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ గృహిణులు సైతం ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. డిజిటల్ హక్కుల కోసం గళమెత్తుతున్న సంస్థ యాక్సెస్ నౌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018 నుంచి 2021 వరకు వరుసగా నాలుగేళ్ళపాటు మన దేశం ఇంటర్నెట్ స్వేచ్ఛలో వెనుకబడింది. 2021లో 106 సార్లు ఇంటర్నెట్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో ప్రపంచంలో అంతర్జాల స్వేచ్ఛను సక్రమంగా కల్పించని అతి పెద్ద అపరాధిగా భారత్ నిలిచింది.