371 రైళ్లు రద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : ‘అగ్నిపథ్’పై ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా శనివారం నాడు 369 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో 201 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగా, 159 లోకల్ ప్యాసింజర్ రైళ్లుగా తెలిపింది. వీటితో పాటు మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేయడంతో శనివారం నాడు మొత్తం రద్దయిన రైళ్ల సంఖ్య 371కి చేరింది. శుక్రవారం నాడు కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. యువత విధ్వంసానికి దిగడం దేశవ్యాప్తంగా 340 రైళ్లను ప్రభావితం చేసింది. 234 రైళ్లను అధికారులు రద్దుచేశారు. వీటిలో 94 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 140 ప్యాసింజర్ రైళ్లు. మరో 95 రైళ్లను పాక్షికంగా రద్దుచేశారు. ఇంకో 11 రైళ్లను దారి మళ్లించారు. బిహార్, జార్ఖండ్, యూపీలోని కొన్ని ప్రాంతాల పరిధిలోని ఒక్క ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లోనే 164 రైళ్లు రద్దయ్యాయి.