కుదేలవుతోన్న క్రిప్టో కరెన్సీ !
1 min readపల్లెవెలుగువెబ్ : క‌్రిప్టో కరెన్సీ క్రాష్ అయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పోటు, ఆర్థిక మాంద్యం భయాలతో క్రిప్టో మార్కెట్ కుదేలవుతోంది. ప్రపంచ ప్రముఖ క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ విలువ 20,000 డాలర్లకు దిగువకు పతనమైంది. కాయిన్‌డెస్క్ ప్రకారం.. బిట్‌కాయిన్ ధర శనివారం ఒక దశలో 9 శాతం క్షీణించి 19,000 డాలర్ల దిగువకు పడిపోయింది. 2020 నవంబరు తర్వాత బిట్‌కాయిన్‌కు మళ్లీ ఇదే కనిష్ఠ ట్రేడింగ్ స్థాయి. 2021 నవంబరులో దాదాపు 69,000 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసుకున్న ఈ క్రిప్టో కరెన్సీ.. ప్రస్తుతం ఆ స్థాయి నుంచి 70 శాతానికి పైగా క్షీణించింది. ఈ ఏడాదిలోనే దాదాపు 60 శాతం తగ్గింది. నం.2 క్రిప్టో ఈథర్ విలువ కూడా 10 శాతానికి పైగా తగ్గి 2021 జనవరి తర్వాత తొలిసారిగా 1,000 డాలర్ల దిగువకు జారుకుంది.