పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్స్ సస్పెండ్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ స్పెషల్ డ్రైవ్‌కు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన హుసేనాపురం, నన్నూరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు డీఎంహెచ్ఓ గిడ్డయ్య. హుసేనాపురం పి.హెచ్.సి.లో డెప్యూటేషన్ పై ఉన్న కొట్టాలపల్లి పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డా.వై.బెంగూరియన్ ను, నన్నూరు పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డా.పి.అపర్ణ ను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ జి. వీరపాండియన్ నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో నోడల్ అధికారి డీపీఓ ప్రభాకర్‌రావు తెలుపగా, వెంటనే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకున్నట్లు డీఎంహెచ్ఓ గిడ్డయ్య వెల్లడించారు.
వారి స్థానంలో..: అలాగే సస్పెండ్ అయిన మెడికల్ ఆఫీసర్స్ స్థానంలో హుసేనాపురం పి.హెచ్.సి కు డా.కె.అమర్నాథ్ రెడ్డి ని, నన్నూరు పి.హెచ్.సి కి డా.కె.సంధ్యారాణి లను డీడీఓ పవర్స్ తో ఇంఛార్జి మెడికల్ ఆఫీసర్లులుగా డి.ఎం.హెచ్.ఓ. నియమించారు.