చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ మోసం !
1 min readపల్లెవెలుగువెబ్ : బ్యాంకులకు ఏకంగా రూ.34,615 కోట్లు ఎగవేసిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో పాటు దాని మాజీ సీఎండీ కపిల్ వాధవాన్, డైరెక్టర్ ధీరజ్ వాధవాన్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. అమరిల్లిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్టితోపాటు మరో 8 మంది బిల్డర్ల పేర్లను సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. సీబీఐ ఇప్పటివరకు దర్యాప్తు చేస్తున్న అతిపెద్ద బ్యాంకింగ్ మోసం ఇదే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి, ముంబైలోని 12 ప్రాంతాల్లో 50 మందికి పైగా అధికారుల బృందం బుధవారం సోదాలు నిర్వహించింది. గతంలో నమోదైన మరో మోసం కేసులో వాధవాన్ సోదరులు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.