స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో పయనిస్తోంది. ఉదయం గ్యాప్ అప్ తో ప్రారంభమైనప్పటీకి .. 11 గంటల సమయంలో లాభాల స్వీకరణ ప్రారంభైంది. దీంతో మార్కెట్లు కన్సాలిడేషన్ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరగడం, ఆక్సిజన్ కొరత లాంటి అంశాలను స్టాక్ మార్కెట్ సీరియస్ గా తీసుకుంది. దీంతో మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభమైనప్పటికీ.. ఇన్వెస్టర్లలో భయం నెలకొంది. ప్రధానంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. విదేశీ పెట్టుబడిదారులు మాత్రం లాభాల స్వీకరణకు దిగారు. దీంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 1:30 నిమిషాల సమయానికి నిఫ్టీ – 10 పాయింట్ల లాభంతో ఉండగా.. బ్యాంక్ నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో ఉంది. అయితే… 1:30 నిమిషాల అనంతరం మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకానికి దిగే అవకాశం ఉండటంతో మార్కెట్లు కొంత నష్టపోయే అవకాశం ఉంది.