ఎంతమంది సోషల్ మీడియా వాడుతున్నారో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు సోషల్ మీడియా వినియోగం పెరుగుతోంది. ప్రపంచ జనాభాలో 62.5 % మంది ఇంటర్నెట్ వాడుతుండగా.. 58.4% మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. 2021 జనవరి నాటికి 420 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగిస్తుండగా.. ఈ సంఖ్య 2022 జనవరి నాటికి 10.1 శాతం వృద్ధిచెంది 462 కోట్లకు పెరిగింది. ఈ విషయం ‘గ్లోబల్ సోషల్ మీడియా స్టాటిస్టిక్స్ రీసెర్చ్ సమ్మరి–2022లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాది కాలంలో 42.4 కోట్ల మంది ఆన్లైన్ వేదికలోకి కొత్తగా చేరారు. ఇంటర్నెట్ను వాడుతున్న వారిలో 93.4% మంది ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫాం వినియోగిస్తున్నారు. వినియోగదారులు సోషల్ మీడియాను రోజుకు సగటున 2:27 గంటలు ఉపయోగిస్తున్నారు.