జర్నలిస్టులపై… కక్ష సాధింపు తగదు..
1 min readపల్లెవెలుగు వెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై కక్ష సాధింపునకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని జర్నలిస్టులుహెచ్చరించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి లో కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై జర్నలిస్టులు నిరసన కార్యక్రమముచేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. అది చాలదన్నట్లు దిన దిన గండంగా జీవనం సాగిస్తున్న జర్నలిస్టులకు వృత్తి పన్ను కట్టాలని అదేశాలివ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల పత్రికలకు,చానల్లకు అతీతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గిరీష పి ఎస్ ఐ ఏ ఎస్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రభుత్వం జర్నలిస్టులపై కక్ష సాధింపునకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదు