`హీరో`కు భారీ ఊరట !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కు భారీ ఊరట లభించింది. హీరో ట్రేడ్ మార్క్ వివాదంపై విజయం సాధించింది. తన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి ‘హీరో’ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించుకోవచ్చని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కేసు తుది పరిశీలన చేసిన తర్వాత ట్రైబ్యునల్ తన నిర్ణయాన్ని ప్రకటించిందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. ఈమేరకు హీరో గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా సమాచారమిచ్చింది.