PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏసీబీ వ‌ల‌లో క‌ర్నూలు అధికారి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్నూలులో అవినీతి తిమింగ‌లం ఏసీబీ వ‌ల‌లో ప‌డింది. నగర పాలక సంస్థ ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇ.సురేంద్రబాబు.. కాంట్రాక్టరు శ్రీనివాసరెడ్డి నుంచి రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా గురువారం అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఎస్‌ఈ పట్టుబడడం ఇంజనీరింగ్‌ విభాగంలో కలకలం రేపుతోంది. కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో గత ప్రభుత్వం లో అమృత్‌ పథకం నిధులు రూ.68 కోట్లతో 430 కి.మీ మేర తాగునీటి పైపులైను, 15 వేల ఇంటింటికి కుళాయిల ఏర్పాటుకు 2018లో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన హ్యూంపైప్స్‌ సంస్థ పనులు దక్కించుకుంది. ఆ సంస్థ నుంచి కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్నారు. 11,300 కుళాయిలు సహా 426.17 కి.మీ. పైపులైన్‌ పనులు పూర్తిచేశారు. శ్రీనివాసరెడ్డికి ఫైనల్‌ బిల్లు రూ.1.52 కోట్లు రావాల్సి ఉంది. ఆ బిల్లు ఇవ్వాలని ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇ.సురేంద్రబాబును సంప్రదిస్తే రూ.35 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరులకు వివరించారు.

                                                        

About Author