PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ.86.96 కోట్లతో ‘ వైఎస్సార్​ సున్నా వడ్డీ’

1 min read
చెక్కు అందజేస్తున్న కలెక్టర్, ప్రభుత్వ చీఫ్​ విప్​, ఎమ్మెల్యే,

చెక్కు అందజేస్తున్న కలెక్టర్, ప్రభుత్వ చీఫ్​ విప్​, ఎమ్మెల్యే,

– వీసీ ద్వారా బటన్​ నొక్కి.. లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన సీఎం జగన్​
– 49,361 సంఘాలకు లబ్ధి
పల్లెవెలుగు వెబ్​, కడప : మహిళల్లో ఆర్థిక భరోసా నింపేందుకు ‘వైఎస్సార్​ సున్నావడ్డీ’ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అన్నారు. శుక్రవారం తాడేపల్లి కార్యాలయం నుంచి వీసీ ద్వారా 2020​–21 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 49,361 సంఘాలకు మంజూరైన రూ.86,96,55,276 లను బటన్​ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు సీఎం వైఎస్​ జగన్​. కడప కలెక్టరేట్​ వీసీలో కలెక్టర్​ సి.హరికిరణ్​, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, జేసీ ధర్మ చంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హరికిరణ్​ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్ధిక ప్రగతి కోసం.. సున్నా వడ్డీ లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి, రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రస్తుతం 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి.. జిల్లా వ్యాప్తంగా (పట్టణంలో 13035, గ్రామీణం 36326) 49,361 స్వయం సహాయక సంఘాలకు గాను “సున్నా వడ్డీ ” సాయం మొత్తం రూ.86,96,55,276.00 లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
మహిళల్లో ఆత్మవిశ్వాసం.. పెంపొందించేందుకే..
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి లు మాట్లాడుతూ మహిళల్లో ఆర్థిక అండ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం “వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం” ను గత ఏడాది ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి మురళీ మనోహర్, మెప్మా పిడి రామ్మోహన్ రెడ్డి, ఎల్డిఎం చంద్ర శేఖర్, గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

About Author