‘సూర్యదేవాలయం’లో… తులసీ వనం
1 min read
పల్లెవెలుగు వెబ్: అగస్త్య సంహితలో చెప్పిన విధముగా తులసి వనం ఉన్నటువంటి ప్రదేశం పరమపావనమైనది. తులసి వనం ఉన్నటువంటి ప్రదేశము నుండి మూడు ఆమడల పర్యంతమూ గంగా తీర సమమమైన పవిత్ర స్థలంగా చెప్పబడింది. ఇటువంటి తులసీ వణమును వారాహి నవరాత్రులలో భాగముగా శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆదేశానుసారంగా వైభవముగా (153తులసి మొక్కలతో )వనమును ఏర్పాటు చేయడం జరిగినది. బాల స్వామీజీ వారి ఆదేశానుసారముగా ఆలయ ట్రస్ట్ సభ్యులు, మాతృమండలి సభ్యులు, భక్త బృందం చేత తులసీ వన పూజా కార్యక్రమం విశేషముగా జరిగినది.
