కోస్తా, రాయలసీమల్లో వర్షాలు
1 min readపల్లెవెలుగువెబ్ : జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఉదయం ఉత్తర ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్యంగా పయనించి ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో కోస్తాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఎక్కువచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులపాటు కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.