NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుద్యోగం పెరిగింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సాగు రంగంలో ఉపాధి నష్టంతో జూన్‌ మాసంలో నిరుద్యోగ రేటు 7.80 శాతానికి పెరిగింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ఈ గణాంకాలతో ఒక నివేదిక విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేమి మే నెలలో 6.62 శాతంగా ఉంటే, జూన్‌ నెలలో 8.03 శాతానికి పెరిగిపోయినట్టు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మే నెలలో 7.12 శాతంగా ఉంటే జూన్‌ నెలలో 7.30 శాతానికి చేరినట్టు తెలిపింది. ‘‘లాక్‌డౌన్‌లు లేని ఒక నెలలో ఉపాధి రేటు ఎక్కువగా పడిపోవడం అన్నది ఇదే. ఇది గ్రామీణ ప్రాంతంలోని రుతువుల వారీగా ఉండే ప్రభావం వల్లే. గ్రామీణ ప్రాంతాల్లో సాగు పనులు లేకపోవం వల్లే ఇలా జరిగింది. విత్తన సాగు మొదలవుతుంది కనుక జూలై నుంచి ఈ పరిస్థితి మారిపోతుంది’’అని సీఎంఐఈ ఎండీ మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు.

                                    

About Author