పేదలకు విద్యను దూరం చేయొద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జాతీయ విద్యా విధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలని ప్రభుత్వ విద్య దూరం చేయొద్దని లేఖలో పేర్కొన్నారు.‘‘ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వల్ల పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ బడులు ఇంకా దూరం అవుతున్నాయి. 2 కిలో మీటరు పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోను, హైస్కూల్స్‌లోను కలపటంవల్ల ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పూర్తిగా పెరిగిపోయింది. జాతీయ విద్యావిధానం అమలు చేయడం కంటే పాఠశాలలు, ఉపాధ్యాయులని తగ్గించే ఆతృత మీలో కనిపిస్తోంది. ఈ విద్యా విధానం వల్ల ప్రస్తుతం ఉన్న 42 వేల పాఠశాలలు భవిష్యత్తులో 11 వేలకి తగ్గిపోనున్నాయి “ అన్నారు.