బూస్టర్ డోస్ పై కేంద్రం కీలక నిర్ణయం
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో ఫోర్త్ వేవ్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డోసుల మధ్య గ్యాప్‌ను ఆరు నెలలకు తగ్గించింది. సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య వ్యవధిని తగ్గించాలని వ్యాక్సినేషన్‌పై సలహా మండలి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ సూచించింది. ఈ మేరకు తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.