టీచర్లతోనే ఇంటర్ బోధన !
1 min readపల్లెవెలుగువెబ్ : బాలికల కోసం ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న ఇంటర్ కోర్సుల బోధన ఉపాధ్యాయులతోనే చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధ్యాయులకు పదోన్నతి ఉండదని, ఒక ఇంక్రిమెంట్ ఇస్తామని తెలిపింది. అర్హులైన 1752 మంది స్కూల్ అసిస్టెంట్లను హైస్కూల్ ప్లస్‌లకు పంపనున్నట్లు తెలిపింది. గురువారం పాఠశాల విద్యా శాఖ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మండలంలో బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ఇటీవల హామీ ఇచ్చారు. కళాశాలలు లేని చోట్ల ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌లుగా మార్చి ఇంటర్ విద్యను ప్రవేశపెడుతున్నారు. 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్ చేశారు.