గూడ్స్ రైలు ఢీ కొని 55 గొర్రెలు మృతి
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామ శివారులోని రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో ఆదివారం 55 గొర్రెలు మృతి చెందాయి. యజమాని స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. గ్రామానికి చెందిన లక్కం రాజం తన గొర్రెలను మేపేందుకు గ్రామ శివారులోని రైల్వే వంతెనపై నుంచిఅవతలి వైపు తరలిస్తున్నాడు. అదే సమయంలో జగిత్యాల నుంచికోరుట్ల వైపు వస్తున్న గూడ్స్ రైలు గొర్రెలను ఢీకొనడంతో 55 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరో 20 గొర్రెలకు గాయాలయ్యాయి. గొర్రెలను కాపాడే ప్రయత్నంలో రాజంకు స్వల్పగాయాలయ్యాయి. సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు రాజం తెలిపాడు.