కొత్త ఉద్యోగాలు వస్తాయ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రసుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఒకపక్క ద్రవ్యవిధానంలో కాఠిన్యం కొనసాగే పరిస్థితి ఉన్నప్పటికీ తమ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని సీఐఐ సర్వేలో పాల్గొన్న పలువురు సీఈఓలు అన్నారు. సీఐఐ నిర్వహణలో 2023 ఆర్థిక సంవత్సరపు రెండవ జాతీయ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఈ సర్వే నిర్వహించారు. ఆ సమావేశంలో పాల్గొన్న 136 మంది సీఈఓల్లోను 57 మంది ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 7 నుంచి 8 మధ్యన ఉండవచ్చన్న ఆశాభావం ప్రకటించగా గ్రామీణ డిమాండ్ పెరిగే ఆస్కారం ఉన్నదని 49 మంది అన్నారు కాగా కంపెనీల ఆదాయ వృద్ధి 10-20 మధ్యన ఉండవచ్చని 44 మంది సీఈఓలు అన్నారు.