నాలాగే .. సింగిల్ గా ఉండండి !
1 min readపల్లెవెలుగువెబ్ : జులై 11 ప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు పనిలో పనిగా జనాభా నియంత్రణ కోసం ఒక చిన్న పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. ఇది చాలా సున్నితమైన విషయం. జనాభా పెరుగుదలను నియంత్రించటం కోసం మనం సరైన మార్గాన్ని ఎంచుకుందాం. లేదా నాలాగే సింగిల్‌గా ఉంటూ...అందరం కలసి స్థిరమైన భవిష్యత్తు కోసం పాటుపడదాం. ఈ రోజు నుంచే సింగిల్ ఉద్యమంలో పాల్గొనండి
అని నాగాలాండ్ మంత్రి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు నాగాలాండ్ మంత్రికి చక్కటి హాస్య చతురత ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.