టీడీపీని భ్రష్టు పట్టిస్తున్న స్వార్థ రాజకీయం..
1 min read–టిడిపి రాష్ట్ర కార్యదర్శి సత్య సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్, చెన్నూరు: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీని కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ బ్రష్టు పట్టిస్తున్నారని అటువంటి వారిని తెలుగు దేశం పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు. కమలాపురం లో సోమవారం ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కమలాపురం నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ కి పటిష్ఠమైన ఓటు బ్యాంక్ వుందన్నారు అయితే గత మూడు దఫాలుగా వరుసగా పార్టీ నియోజక వర్గంలో ఓటమి చెందడానికి కారణం నాయకుల స్వార్థమే నన్నారు. తెలుగుదేశం పార్టీని తమ ఆర్థిక ప్రయోజనాల కోసం తమ పబ్బం గడుపుకోవడం కోసం అధికారం లో ఉన్నపుడు వినియోగించుకొని పార్టీ అధికారం కోల్పోయాక పార్టీని గాలికి వదిలేసిన వారిని శాశ్వతంగా బహిష్కరిస్తేనే పార్టీకి నియోజకవర్గంలో జనజీవాలు ఉంటాయన్నారు నియోజక వర్గం వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ నాయకత్వ మార్పు కోరుకుంటున్నారన్నారు నియోజక వర్గంలో గత 15 సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీ విజయం పొందలేక పార్టీ కార్యకర్తలు చాలా మదన పడుతున్నారన్నారు తెలుగు దేశం పార్టీకి నిజాయతీ గా పనిచేస్తున్న వారిని అణగదో క్కడానికి తెలుగుదేశం పార్టీ ని నియోజక వర్గంలో భూస్థాపితం చేయడానికీ కొందరు వైసీపీ వారితో లోపాయికారీ ఒప్పందాలు చేసుకొంటూ పార్టీ నాయకులుగా చలామణి అవ్వడం శోచనీ యమన్నారు .రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారం లోకి వచ్చిన మూడు సంవత్సరాలకాలంలో రెండున్నర సంవత్సరాలు పార్టీ గురించి అతి గతి పట్టించుకోని స్వార్థ రాజకీయనాయకులు నేడు మరలా పార్టీ అధికారం లోకి వస్తుందనే ఉద్దేశంతో ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తూ పార్టీ క్రియా శీలక నాయకులమని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలన్నారు రోజుకు ఒక పార్టీ మారే కొందరు నాయకులు ఎన్నికలప్పుడు ప్రతిపక్ష పార్టీ లతో డబ్బులతో కుమ్మక్కు అయే వారు పార్టీ నాయకులమని చెప్పుకొంటుండడంతో పార్టీ భవిష్యత్ అందకారంగా మారుతోందనన్నారు రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేసి విఫల మైన వారు కూడా పార్టీ లో నిజాయితీగా పనిచేస్తున్న వారిని సస్పెండ్ చేయాలని కోరడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు కమలాపురం నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీని ప్రక్షాళన చేస్తే పార్టీ వచ్చే ఎన్నికలలో విజయం తప్పక సాధిస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు ను లోకేష్ ను దూషించి నప్పుడు గాని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై వైసీపీ వారు ధాడి చేసి నప్పుడు గాని అలాగే చంద్ర బాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దేవి గారిని వైసీపీ వారు దుర్బాషలాడినప్పుడు గాని మచ్చుకైనా స్పందించని నాయకులు నిజాయతీ గా పనిచేస్తున్నతనను వ్యక్తి గత స్వార్థ ప్రయోజనాల కోసం విమర్శిస్తూ పబ్బం గడుపు కొంటునంటన్నారన్నారు. ప్రజాక్షేత్రంలో విజయం సాధించలేక పార్టీ పరువు తీసిన వారు ,తీస్తున్న వారు కూడ తనను విమర్శించడం హాస్యాస్పదం ఆన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా తెలుగుదేశం స్వచ్చంద కార్యకర్తలచే తాను పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం అధిష్టానానికి నివేదించి స్వార్థపరులను సస్పెండ్ చేపించి తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని పేర్కొన్నారు.