PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టుల పిల్లల విద్యకు…60శాతం రాయితీ ఇవ్వాలి: ఏపీజేఎఫ్​

1 min read

పల్లెవెలుగు వెబ్​: సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం స్వచ్ఛందంగా పని చేసే జర్నలిస్టుల పిల్లల విద్యకు.. కార్పొరేట్​, ప్రైవేట్​ పాఠశాలలో ఫీజులో 60శాతం రాయితీ ఇవ్వాలని కలెక్టర్​ కోటేశ్వరరావును కోరారు ఏపీజేఎఫ్​ కర్నూలు జిల్లా నాయకులు. సోమవారం కర్నూలు కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో జరిగే ‘ స్పందన ’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్​ కోటేశ్వరరావును ఏపీజేఎఫ్​ జిల్లా అధ్యక్షుడు టి. రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు కలిశారు. జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి కార్పొరేట్​, ప్రైవేట్​ పాఠశాలల్లో ఫీజులు రాయితీ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు టి. రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ… సమాజ అభివృద్ధికి పాటుపడే జర్నలిస్టుల పిల్లల చదువులో రాయితీ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్​ కోటేశ్వరరావు జర్నలిస్టుల పిల్లల చదువు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటామని, డీఈఓకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.  కలెక్టర్​ను కలిసిన వారిలో జి. సామెల్. మధు. కే శ్రీనివాసులు సుదర్శన్. మంజునాథ్. శ్రీనాథ్ రెడ్డి,  రాఘవేంద్ర గౌడ్. పుల్లయ్య. రవి కుమార్​ నాయుడు, సురేష్. నరసింహ. రాజు. M.మధు. శేఖర్.. గంగాధర్. తదితరులు పాల్గొన్నారు.

About Author