భారీ వర్షాలకు దెబ్బతిన్న తేయాకు తోటలు !
1 min readపల్లెవెలుగువెబ్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల తేయాకు తోటలకు దెబ్బ తగిలింది. దేశంలోని మొత్తం తేయాకు ఉత్పత్తిలో దాదాపు 81 శాతం వాటా కలిగిన అసోం, పశ్చిమ బెంగాల్‌లోని తేయాకు పరిశ్రమ ప్రకృతి ప్రకోపానికి గురైంది. మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, ఆ తర్వాత వచ్చిన వరదలు ఈ ప్రాంతంలోని తేయాకు రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.అసోంలో గత ఏడాది ఉత్పత్తితో పోలిస్తే జూన్ నెలలో టీ ఉత్పత్తి 27 శాతం తగ్గింది. బ్రహ్మపుత్ర లోయలో 11 శాతం, బరాక్ లోయలో 16 శాతం తేయాకు ఉత్పత్తి తగ్గుదల నమోదైంది.తేయాకు తోటలు కరవు లేదా వరదలను తట్టుకోలేవు.