సీజనల్ వ్యాధులతో… జాగ్రత్త: నందిరెడ్డి సాయి రెడ్డి
1 min readకర్నూలు: సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి సాయి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బళ్లారి చౌరస్తాలోని ఉల్చాల రోడ్డులో గల వీక్షిత క్లినిక్ నందు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్. మిథున్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఉచిత వైద్య శిబిరము కు ముఖ్యఅతిథిగా నంది రెడ్డి సాయి రెడ్డి పాల్గొని శిబిరమును ప్రారంభించి అనంతరం రోగులకు ఉచితంగా మందుల పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ మిథున్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో దృష్ట్యా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరమును నిర్వహిస్తున్నామని అలాగే ఉచితంగా బిపి షుగర్ థైరాయిడ్ వంటి టెస్టులను చేసి రోగ నిర్ధారణ చేసి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ టీ ప్రతాపరెడ్డి, డాక్టర్ భాస్కర్ రెడ్డి, బిజెపి నాయకులు కే.రాఘవులు, బైరెడ్డి నవీన్ రెడ్డి, స్థానిక నాయకులు మధు, ధరణి ,నాగరాజు, తిమ్మారెడ్డి, జానకి రామ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.