ఏపీ వర్షాల పై ఐఎండీ రిపోర్టు ఇదే !
1 min readపల్లవెలుగువెబ్ : వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒరిస్సాను తీవ్ర అల్పపీడనం కొనసాగుతుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందన్నారు.