పార్లమెంట్ లో ఈ పదాలు ఇక వాడకూడదు !
1 min readపల్లెవెలుగువెబ్ : పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు ఒకరినొకరు తిట్టుకునేందుకు ఇప్పటి వరకు ఉపయోగించిన కొన్ని పదాలను ప్రభుత్వం నిషేధించింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు కొన్ని పదాలు వాడకూడదని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలను అన్ పార్లమెంటరీ పదాలుగా గుర్తించింది. ఈ పదాలను ఇకపై ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీల్లేదని అందులో స్పష్టం చేసింది. అలాగే, బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూజ్డ్, చీటెడ్, కరప్ట్, డిక్టేటోరియల్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, అన్‌ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్ వంటి ఇంగ్లిష్ పదాలను ఆ జాబితాలో చేర్చింది.