ఎలాంటి పదాలను నిషేధించ లేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : రాజకీయ విమర్శల నేపథ్యంలో అన్‌పార్లమెంటరీ పదాల జాబితా స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఎలాంటి పదాలపై నిషేధం విధించడం లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కొన్ని పదాలను తొలగించామని, తొలగించబడిన పదాల సంకలనం మాత్రమే జారీ చేయబడిందని, అంతేగానీ ఎలాంటి పదాలను నిషేధించలేదని పేర్కొన్నారు ఆయన. గురువారం సాయంత్రం ఆయన ఈ విషయంపై మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు.