ప్రపంచంలోని గొప్ప ప్రాంతాలు.. ఇండియాలోని రాష్ట్రాలకు చోటు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్‌లోని రెండు ప్రాంతాలకు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు-2022 జాబితాలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం, కేరళ రాష్ట్రాలకు చోటు దక్కింది. 50 అత్యుత్తమ పర్యటక గమ్యస్థానాల‍్లో భారత్‌లోని ఈ రెండు ప్రాంతాలు స్థానం సంపాదించాయి. భారత్‌లోని తొలి యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ నగరం అహ్మదాబాద్‌లో ఎన్నో కలగలిసి ఉన్నాయని పేర్కొంది. ‘సంప్రదాయ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఇక్కడ పురాతన స్థలాలతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు ఉన్నాయి. అందులో సబర్మతి నది సమీపంలో 36 ఎకరాలతో ఉన్న గాంధీ ఆశ్రమం నుంచి ప్రపంచంలోనే సుదీర్ఘ నృత్య పండుగ నవరాత్రి ఉత్సవాల వరకు చాలా ఉన్నాయి.’ అని పేర్కొంది. మరోవైపు.. భారత్‌లోని ఆగ్నేయ తీర ప్రాంతంలో కేరళ ఒక అందమైన రాష్ట్రంగా అభివర్ణించింది టైమ్. అందమైన బీచ్‌లు, ఆలయాలు, ప్రాంతాలు ఉన్నాయని, దేవతలు నివసించే దేశంగా మారిందని పేర్కొంది. ఈ ఏడాది భారత్‌లో పర్యాటక రంగాన్ని కేరళ మరింత ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపింది.