పెళ్లికాని వారి సంఖ్య పెరుగుతోంది !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలోని యువతలో అవివాహితులు పెరుగుతున్నారని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. జాతీయ యువజన పాలసీ-2014 ప్రకారం.. 15-29 ఏళ్ల మధ్య వయసు వారిని యువత అని నిర్వచించారు. ఈ ఏజ్ గ్రూప్‌లో యువత విషయంలో 2011 లెక్కల ప్రకారం 17.2ు మంది అవివాహితులు ఉండగా.. 2019కి అది 23 శాతానికి పెరిగింది. ఇదే సమయానికి పురుషుల్లో అవివాహితుల సంఖ్య 20.8ు నుంచి 26.1 శాతానికి పెరగ్గా.. యువతుల్లో 13.5ు నుంచి 19.9శాతానికి పెరిగింది. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అవివాహిత యువత సంఖ్య అధికంగా ఉందని.. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువగా ఉందని ఈ సర్వే వివరించింది.