తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీలకం అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామాతో కొత్త అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే ప్రక్రియ ముగిసేవరకూ ప్రధాని రణిల్ విక్రమసింఘెనే తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని స్పీకర్ మహింద యప అబెవర్దన పేర్కొన్నారు. శనివారం పార్లమెంటు సమావేశం అవుతుందని, వారంరోజుల్లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. అధ్యక్ష పదవికి నామినేషన్లను జూలై 19న స్వీకరిస్తామని.. 20న సభ్యులు కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారని స్పీకర్వెల్లడించారు. కాగా.. అధ్యక్షుడి రాజీనామాను స్పీకర్ లాంఛనంగా ప్రకటించడంతో రణిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.