గోదావరి మహోగ్రహ రూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లోని ధవళేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంట గంటకూ గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం దగ్గర 21.30 అడుగులకు నీటిమట్టం చేరింది. 25.08 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి వరద విలయం కొనసాగుతోంది. లంక గ్రామాల్లో ముంపు బాధితులకు తినడానికి తిండి లేదు. తలదాచుకోవడానికి చోటు లేదు. ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇళ్లల్లోని సామగ్రి గోదావరి పాలైంది. పంటలు నీట మునిగాయి. కొట్టుకుపోగా మిగిలిన సామగ్రి, కోళ్లు, పశువులను వెంట బెట్టుకుని బాధితులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.