జపనీస్ ఎన్సెఫలైటిస్ తో 23 మంది మృతి !
1 min readపల్లెవెలుగువెబ్ : అసోంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇంతవరకూ 23 మంది ఈ వ్యాధితో మృతిచెందారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు. ఈ వ్యాధి వల్ల మెదడులోని నాడీ కణాల్లో వాపు ఏర్పాటు వాటి పనితీరులో అవరోధాలు ఏర్పాడతాయి. మెదడువాపు సోకిన వారిలో సాధారణంగా తలనొప్పి, జ్వరం, వాంతులు, మతిస్థిమితం తప్పడం, అపస్మారక స్థితి, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.