‘భవాని నగర్’లో సమస్యకు పరిష్కారం..
1 min readపల్లెవెలుగు వెబ్, చెన్నూరు: కడప జిల్లాచెన్నూరు భవాని నగర్ లో వర్షం నీరు వెళ్లేందుకు వీళ్లు లేకపోవడంతో మోకాలిలోతు నీటితోనే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై భవాని నగర్ ప్రజలు గ్రామపంచాయతీ సర్పంచ్ వెంకటసుబ్బయ్య (కళ్యాణ్) వైసీపీ నాయకుడు ముది రెడ్డి సుబ్బారెడ్డి. గ్రామ పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే స్పందించి భవాని నగర్ లోని మొదటి వీధిలో సిమెంట్ రోడ్డు పక్కన వర్షం నీరు వెళ్లేందుకు చిన్నపాటి కాలువలు ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి సిమెంట్ రోడ్డు పైనే నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఆ రహదారి ప్రజలకు ఊరట లభించింది. అలాగే భవాని నగర్ టు లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో సర్పంచ్ తో పాటు వైకాపా నాయకులు. గ్రామపంచాయతీ కార్యదర్శి వెంటనే స్పందించి అక్కడ వర్షం నీరు నిల్వ ఉండకుండా ప్రో క్లైన్ సహాయంతో చిన్నపాటి కాలువలు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై భవాని నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.