117 జీవోను రద్దు చేయాలి: ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: విద్యా వ్యవస్థ ను నిర్వీర్యం చేసే 117 జీవోను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పత్తికొండలోని శాంతి టాలెంట్ స్కూల్ లో ఎస్ టి యు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 117 జీవో పర్యవసానాలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎస్ టి యు జిల్లా కౌన్సిల్ నెంబర్ కొత్తపల్లి సత్యనారాయణ యుటిఎఫ్ నాయకులు ప్రసాద్ బాబు మాట్లాడుతూ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే 117 జీవో ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 117 జిఓ వలన 3 4 5 తరగతుల ను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తారని తెలిపారు. ఈ కారణంగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు రద్దు అవుతాయని అన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రాథమిక దశలోనే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమై ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతబడి గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విలీన ప్రక్రియ ను తక్షణమే ఆపాలని, 128 జీవోను సవరించాలని విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేనియెడల ఉపాధ్యాయ విద్యార్థి ఐక్య ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపిటిఎఫ్ నాయకులు నాగేటి ప్రసాద్ ఎస్ఎఫ్ఐ నాయకులు మధు ఏఐఎస్ఎఫ్ నాయకులు మోహన్, అల్తాఫ్ యుటిఎఫ్ ఎస్టియు నరసోజి, రామ్మోహన్ రెడ్డి సిపిఐ నాయకులు రాజా సాహెబ్, ఏఐవైఎఫ్ నాయకులు కారుమంచి, దళిత హక్కుల సంఘం నాయకులు గురుదాస్ సిపిఐ పట్టణ, కార్యదర్శి రామాంజనేయులు టి ఎన్ ఎస్ యు నాయకులు ముని నాయుడు తదితరులు పాల్గొన్నారు.