PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌రెంట్ బిల్లు ఎక్కువ వ‌చ్చింద‌ని.. హైటెన్ష‌న్ వైర్ ఎక్కి నిర‌స‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఓ పేదవాడికి విద్యుత్ బిల్లు షాక్ గట్టిగా తగిలింది. దీంతో ఆ వ్యక్తి 40కే వోల్టు హైటెన్షన్ వైర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ ఏర్పడింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నందకాపూర్వ గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న ఓ పేద కుటుంబానికి రూ. 7,700 విద్యుత్ బిల్లు వచ్చింది. బిల్లు ఎందుకొచ్చిందో? ఆ బిల్లు ఎలా చెల్లించాలో తెలియక ఆ ఇంటి యజమాని అధికారుల చుట్టు తిరిగాడు. అయినా ఫలితం కనిపించలేదు. అయితే కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ అధికారులు అతని ఇంటికి పవర్ కనెక్షన్ తీసేశారు. దీంతో ఆగ్రహించిన ఇంటి యజమాని హైటెన్షన్ వైర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు.

                                                    

About Author