వివాదంలో ` పొన్నియన్ సెల్వన్` !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్
కోర్టు వివాదంలో చిక్కుకుంది. పొన్నియిన్ సెల్వన్’ లో చోళులను తప్పుగా చిత్రీకరించేలా సన్నివేశాలున్నాయంటూ సెల్వమ్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోస్టర్‌లో ఆదిత్య కరికాలన్ నుదుటిన తిలకం ఉందన్నారు. చిత్ర బృందం విడుదల చేసిన టీజర్‌లో మాత్రం ఆదిత్య నుదుటిన తిలకం లేదన్నారు. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్‌ను తప్పుగా చూపించే అవకాశం ఉందని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అందువల్ల తనకు ప్రత్యేకంగా షో వేయాలని కోరుతూ మణిరత్నం, విక్రమ్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.