శ్రీశైలంలో 131 టీఎంసీల నీరు !
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీశైల జలాశయంలోకి ఇటు తుంగభద్ర, అటు కృష్ణా నదులు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. శ్రీశైలంలో సోమవారం 3,18,488 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఇప్పటికి 131.8508 టీఎంసీల నీరు చేరింది. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయం నుంచి శ్రీశైలంలోకి వరద వస్తోంది. అలాగే, తుంగభద్ర జలాశయానికి 1,71,381 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 31 గేట్లు ఎత్తి నదికి 1,63,090 క్యూసెక్కులు, హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయచూరు మెయిన్ కెనాల్ తదితర కాలువలకు మరో 6,984 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న తుంగ జలాశయం నిండి 40,317 క్యూసెక్కులు, భద్ర జలాశయం నిండి 30,188 క్యూసెక్కుల వరద తుంగభద్ర డ్యాంలోకి వస్తోంది.