NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచలింగాల వద్ద…. కర్ణాటక మద్యం పట్టివేత…

1 min read

పల్లెవెలుగు వెబ్​: అంతరాష్ట్ర సరిహద్దు.. పంచలింగాల చెక్​ పోస్టు వద్ద సెబ్​ పోలీసులు భారీగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు. అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఇంచార్జి ఏఈఎస్ రాజశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో SEB ఇన్​స్పెక్టర్​ మంజుల, SI ప్రవీణ్ కుమార్ నాయక్, DTF SI స్వామినాథన్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది మంగళవారం వాహనాలను తనిఖీ చేశారు.  చెక్​ పోస్టు వద్ద తెల్లవారు జామున 4 గంటలకు జరిపిన తనిఖీలో రెండు కార్లలో కర్ణాటక మద్యం original choice విస్కీ (టెట్రా ప్యాకెట్స్ )94 బాక్సులు సీజ్ చేశారు. AP 29 R 7200 నెంబర్ గల కారు నందు 41 బాక్సులు,  AP 09 BG 1390 కారు నందు 53 బాక్సులు  మొత్తం 94 బాక్సుల కర్ణాటక మద్యం సీజ్ చేశారు. కార్ డ్రైవర్లు ఇద్దరు కార్ వదిలి పారిపోయారు.  పట్టుబడిన కార్లను మద్యం ను తదుపరి చర్యల నిమిత్తం కర్నూల్ SEB పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది ఆన్సర్, కరుణాకర్  పాల్గొన్నారు.

About Author