హిజాబ్ అనుమతించే కళాశాల ఏర్పాటుకు యత్నం !
1 min readపల్లెవెలుగువెబ్ : ముస్లిం విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇచ్చే కళాశాలలను ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని ముస్లిం విద్యా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ కన్నడలో ప్రీ-యూనివర్సిటీ కళాశాలల ఏర్పాటుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని 13 ముస్లిం విద్యా సంస్థలు కోరాయి. హిజాబ్ వివాదం ఇటీవల ఇక్కడి నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. తరగతి గదుల్లోకి ఎటువంటి మతపరమైన వస్త్రాలను అనుమతించరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యధిక ముస్లిం విద్యార్థినులు పాటిస్తున్నారు. కానీ కొందరు మాత్రం హిజాబ్ ధారణపై పట్టుబడుతున్నారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి లేకపోవడంతో ఇటువంటివారు చదువు మానేశారు.