పెళ్లి కాకుండానే తల్లి.. సుప్రీం కోర్టులో ఊరట !
1 min readపల్లెవెలుగువెబ్ : అబార్షన్‌కు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి కాని యువతి 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అబార్షన్ చేసినా ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని ఢిల్లీ ఎయిమ్స్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు చెప్పడంతో ఇందుకు ఓకే చెప్పింది. పెళ్లికానందు వల్ల ఈ యువతి అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం అలాంటి పరిమితులు ఏమీ లేవని చెప్పింది. 2021లో సవరించిన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ను ప్రస్తావించింది. పెళ్లికాని మహిళలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.