ఈడీ ఎదుట ముగిసిన సోనియా విచారణ
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు గురువారం హాజరయ్యారు. దాదాపు మూడు గంటలపాటు సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయల్దేరిన సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియాగాందీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. విచారణ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు.