మెజార్టీ దిశగా ద్రౌపది ముర్ము
1 min readపల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ మెజారిటీ దిశగా దూసుకెళుతున్నారు. తొలి రౌండ్‌లో ఆధిక్యాన్ని కనబర్చిన ముర్ము తాజాగా వెలువడిన ఫలితాల్లో కూడా అదే జోరును కొనసాగించారు. తాజాగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకూ లెక్కించిన 1,886 ఓట్ల విలువ 6,73,175 కాగా.. వీటిలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 1,349 ఓట్లు పోలయ్యాయి. ఆమెకు పోలయిన ఓట్ల విలువ 4,83,299. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు పోలయినట్లు తెలిసింది. ఆయనకు పోలయిన ఓట్ల విలువ 1,89,876. ఆల్ఫాబెటికల్‌లో పది రాష్ట్రాల ఓట్లను లెక్కించిన క్రమంలో ముర్ము భారీ ఆధిక్యం కనబర్చారు. ఎన్డీయే పెట్టుకున్న అంచనాలకు మించి భారీ మెజార్టీతో ముర్ము గెలిచే అవకాశం ఉందని ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది.