ఆర్థిక మాద్యం వచ్చే అవకాశాలున్నాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలు ఇందుకు దోహదపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి విలువ పడిపోవడం వల్ల పెద్దగా ఆందోళన లేదని.. అది సాధారణమేనని అహ్లూవాలియా వ్యాఖ్యానించారు. అయితే, విదేశీ మారక నిల్వలు పడిపోతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని వివరించారు. ఆర్థిక సంస్కరణలు కేవలం దిశానిర్దేశం మాత్రమే చేస్తాయని, వాటిని సరైన రీతిలో అమలుచేస్తేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఎంహెచ్ఆర్డీలో జరిగిన భారతదేశంలో సంస్కరణలు
అనే అంశం పై ఆయన మాట్లాడారు.