దేశంలో 6.5 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : రెండేళ్లుగా కొనసాగుతున్న సెమీకండక్టర్ల (చిప్) కొరత వాహన తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్య కారణంగా దేశంలోని ప్రధాన కార్ల కంపెనీల వద్ద 6.5 లక్షల వరకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో సగానికి పైగా అంటే 3.4 లక్షల యూనిట్లు పెండింగ్ ఆర్డర్లు తమవేనని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యుండయ్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) కలిపి 3 లక్షల వరకు కార్లను డెలివరీ అందించాల్సి ఉండగా.. టాటా మోటార్స్, కియా, హోండా వద్ద కూడా పెండింగ్ ఆర్డర్లు భారీగానే పేరుకుపోయాయి. దాంతో కొత్త మోడల్ కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లు నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. తమ కారు మోడల్, వేరియంట్, కలర్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ 4-12 వారాల స్థాయిలో ఉందని టాటా మోటార్స్ ప్రతినిధి తెలిపారు. ఎలక్ట్రిక్ కార్ల కోసం కస్టమర్లు 6 నెలల వరకు ఆగాల్సి వస్తోందన్నారు.