తెలుగు పరిశ్రమకు జాతీయ అవార్డుల పంట !
1 min readపల్లెవెలుగువెబ్ : 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్‌ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో ‘నాట్యం’ చిత్రం ఎంపిక కాగా, ఉత్తమ సంగీత చిత్రంగా ‘అలవైకుంఠ పురములో’ పురస్కారాలు దక్కించుకున్నాయి.