శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనున్న మంత్రి అంబటి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. పదకొండు రోజుల నుంచి వస్తున్న వరదతో జలాశయం నిండుకుండలా మారింది. శుక్రవారం రాత్రి 10:30గంటలకు జూరా ల నుంచి 31,563 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 61,456 క్యూసెక్కులు మొత్తంగా 93,019 క్యూసెక్కుల ప్రవాహం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 882.10 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను 199.7354 టీఎంసీల నీరు చేరింది. జలాశయం నీటిమట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరుకోవడంతో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శనివారం గేట్లు ఎత్తి నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేయనున్నారు.