గోవాలో అక్రమ బార్ స్మృతి ఇరానీ కూతురిదే !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో నిబంధనలకు విరుద్ధంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చే సింది. ఇది తీవ్రమైన అంశమేనంటూ కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ప్రతులను మీడియాకు విడుదల చేసింది. ‘స్మృతి కూతురు నడుపుతున్న రెస్టారెంట్ లైసెన్స్‌ను మే 2021లో చనిపోయిన ఓ వ్యక్తి పేరు మీద జూన్ 2022న తీసుకున్నారు. 13 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద లైసెన్స్ ఎలా తీసుకుంటారు? ఇది ముమ్మాటికీ అక్రమమే’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చెప్పారు. గోవా నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్‌కు ఒక బార్ లైసెన్స్ మాత్రమే ఉండాలని, కానీ సిల్లీ సోల్స్ గోవా రెస్టారెంట్ పేరిట రెండు బార్ లైసెన్స్‌లు ఉన్నాయని పవన్ ఆరోపించారు. స్మృతి ఇరానీ ప్రమేయం లేకుండానే ఆమె కూతురు లైసెన్స్ పొందడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు.