PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెళ్లి చేసుకున్నా చేసిన నేరం తొల‌గిపోదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి, అనంతరం ఆమెను వివాహం చేసుకున్నప్పటికీ ఆ నేరం తొలగిపోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం కారణంగా ఆమె గర్భందాల్చి బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ నిందితునిపై రేప్‌ కేసు కొనసాగుతుందని తెలిపింది. ఈ కారణాలు చూపి నిందితుడు తప్పించుకోలేడని పేర్కొంది. నిందితునికి బెయిల్‌ నిరాకరిస్తూ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో జస్టిస్‌ అనూప్‌ కుమార్‌ మెండిరట్టా ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 నవంబరులో 27 ఏళ్ల నిందితుడు 14 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచారం జరిపాడు. అనంతరం 2021 అక్టోబరులో ఆమెను నిందితుని ఇంటి వద్ద గుర్తించారు. అప్పటికి 8 నెలల క్రితం ఆమెకు పాప జన్మించింది. మళ్లీ గర్భం దాల్చింది. అత్యాచార కేసుల్లో మైనర్‌ బాలిక సమ్మతించిదా, లేదా అన్నదానితో సంబంధం లేదని న్యాయమూర్తి తెలిపారు. ఒకవేళ ఆ బాలిక తెలివి తక్కువతనంతో ఒప్పుకొన్నా చట్టం ప్రకారం దానికి గుర్తింపు లేదన్నారు. ఆమెను గుడిలో వివాహం చేసుకున్నానని చెప్పాడని, కానీ ఆ కారణంగా అతడు పవిత్రుడైనట్టు కాదని వివరించారు. అతడి బెయిల్‌ మంజూరుకు తిరస్కరించారు.

                                       

About Author